Mon Dec 23 2024 11:27:50 GMT+0000 (Coordinated Universal Time)
లెక్క తప్పితే.. చూస్తూ ఊరుకోం
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న ఉద్యోగాలను పీకేసి కొత్త ఉద్యోగాల పేరుతో భర్తీ చేసినట్లు లెక్కలు చూపుతున్నారని ఫైర్ అయ్యారు. 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కేసీఆర్ కు పట్టింపులేదన్నారు. అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతున్నా ఉద్యోగాల భర్తీ గురించి పట్టించుకోలేదన్నారు. కమిటీల పేరిట ప్రభుత్వం కాలయాపన చేయడాన్ని వైఎస్ షర్మిల తప్పుపట్టారు.
పదివేల ఉద్యోగాలను....
ఇక పది వేల ఉద్యోగాలను మింగేయాలని కేసీఆర్ చూస్తున్నాడని వైఎస్ షర్మిల ఆరోపించారు. ధరణి పేరిట భూములను దోచుకోవడానికి అడ్డంగా ఉన్నారని వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారని విమర్శించారు. ఆ వ్యవస్థలో ఇప్పుడు గ్రూప్ 4 ద్వారా భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. 1.91 లక్షల ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగం లెక్క తప్పినా వదిలిపెట్టేది లేదని షర్మిల హెచ్చరించారు. ఉద్యోగాల ప్రక్రియ పూర్తి చేసేంతవరకూ వైఎస్సార్టీపీ పోరాటం చేస్తూనే ఉంటుందని అన్నారు.
Next Story