Mon Nov 25 2024 12:51:00 GMT+0000 (Coordinated Universal Time)
రాష్ట్ర మహిళ కమిషన్ కు షర్మిల ఫిర్యాదు
రాష్ట్ర మహిళ కమిషన్ కు వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు. పాదయాత్రపై బీఆర్ఎస్ నేతలు దాడులు చేశారన్నారు
రాష్ట్ర మహిళ కమిషన్ కు వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు. తన పాదయాత్రపై మహబూబాబాద్ లో బీఆర్ఎస్ నేతలు దాడులు చేశారన్నారు. ఎమ్మెల్యేలు తన పాదయాత్రను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. తన వాహనాలను కూడా ధ్వంసం చేశారని వైఎస్ షర్మిల మీడియాకు తెలిపారు. శంకర్ నాయక్ తో పాటు అతని భార్యపై కూడా అవినీతి ఆరోపణలున్నాయని షర్మిల విమర్శించారు. తన పాదయాత్ర కొనసాగేలా తిరిగి చర్యలు తీసుకోవాలని షర్మిల కోరారు.
పాదయాత్ర కొనసాగేలా...
అధికార పార్టీ విమర్శిస్తున్నందుకే తనను పదే పదే అడ్డుకుంటున్నారని, దాడులు చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. తెలంగాణ ప్రజలు వీటిని గమనిస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన భూముల కబ్జా కేసులో శంకర్ నాయక్ భార్య నిందితురాలిగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ నేతలు కబ్జాలు చేస్తుంటే చోద్యం చూస్తుంటారా? అని షర్మిల ప్రశ్నించారు. తనను ఎన్ని మాటలను అన్నా తాను మౌనంగా ఉండాలనేనా మీ ఉద్దేశ్యం అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ గూండాలకు అందరూ కలసి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.
Next Story