Sun Dec 22 2024 16:21:58 GMT+0000 (Coordinated Universal Time)
జగ్గారెడ్డి కేటీఆర్ కోవర్ట్.. వైఎస్ షర్మిల ఫైర్
వైస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మండి పడ్డారు. జగ్గారెడ్డి కేటీఆర్ కోవర్ట్ అని అన్నారు
వైస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మండి పడ్డారు. జగ్గారెడ్డి కేటీఆర్ కోవర్ట్ అని ఆమె విమర్శించారు. ఈ విషయం అందరికీ తెలుసునని, గాంధీ భవన్ లో ప్రతి ఒక్కరూ ఈ విషయంపై మాట్లాడుకుంటారని షర్మిల అననారు. వైఎస్సార్ పార్టీ మారాడని, తనను కూడా కాంగ్రెస్ లోకి రమ్మని పిలిచింది వైఎస్సార్ అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడన్నారు. వైఎస్ ఎప్పుడు పార్టీ మారిందో జగ్గారెడ్డికి తెలుసా? అని షర్మిల ప్రశ్నించారు. వైఎస్సార్ గెలిచిన పార్టీయే కాంగ్రెస్ లో కలసి పోయిందని తెలిపారు.
నీలా పార్టీలు మారరు...
జగ్గారెడ్డిలా పార్టీలు మారి రాజకీయ వ్యభిచారం చేసే నైజం వైఎస్సార్ ది కాదని షర్మిల అన్నారు. ఆ అలవాటు కూడా ఆయనకు లేదన్నారు. సంగారెడ్డికి ఎమ్మెల్యే ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని షర్మిల ఫైర్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారని, రేపు ఆయన ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదని షర్మిల ఎద్దేవా చేశారు. వైఎస్సార్ ను, తన కుటుంబాన్ని విమర్శిించే నైతిక హక్కు జగ్గారెడ్డికి లేదని ఆమె అన్నారు.
Next Story