Mon Dec 23 2024 11:56:34 GMT+0000 (Coordinated Universal Time)
పాలేరులో భూమి పూజ
పాలేరులో పార్టీ కార్యాలయం నిర్మాణానికి వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల భూమి పూజ చేశారు
పాలేరులో పార్టీ కార్యాలయం నిర్మాణానికి వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల భూమి పూజ చేశారు. ఈకార్యక్రమంలో వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. ఈ పూజ ఉజ్వల భవిష్యత్ కు నాంది పలుకుతుందని చెప్పారు. వెనకబడిన వర్గాల కోసమే వైఎస్సార్టీపీ పనిచేస్తుందని వైఎస్ విజయమ్మ తెలిపారు. ప్రజల అభ్యున్నతి కోసం వైఎస్ కుటుంబం ఎప్పుడూ పనిచేస్తుందని చెప్పారు. షర్మిల పార్టీ పెట్టి పదహారు నెలలయినా ఎన్నో పోరాటాలను చేసిందని ఆమె గుర్తు చేశారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేసినా వెనక్కుతగ్గలేదని వైఎస్ విజయమ్మ అన్నారు. ఇచ్చిన మాట కోసం ఎంతదూరమైనా వెళ్లే కుటుంబం వైఎస్ కుటుంబం అని విజయమ్మ అన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న తప్ప మరో ఆలోచన ఉండదన్నారు.
వైఎస్ పాలన...
ప్రజలకు వైఎస్ పాలన గురించి తెలుసునని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఐదు సంవత్సరాల్లోనే వైఎస్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి పేదలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేశారన్నారు. ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత ఒక్క వైఎస్ కే చెల్లుతుందన్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం కారణంగా ఎందరో పేదలు ఉన్నత చదువులు చదువుకున్నారని ఆమె అన్నారు. ఆరోగ్య శ్రీతో పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించారని, అలాంటి పాలననే మళ్లీ ప్రజలు కోరుకుంటున్నారని వైఎస్ షర్మిల అన్నారు.
Next Story