Tue Nov 26 2024 02:01:43 GMT+0000 (Coordinated Universal Time)
ప్రతి తలపై నాలుగు లక్షల అప్పుు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో ముంచారని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో ముంచారని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ప్రతి కుటుంబంపై కేసీఆర్ నాలుగు లక్షలు అప్పులు చేశారని ఆమె ఆరోపించారు. వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతుంది. పాదయాత్రకు జనం నుంచి మంచి స్పందన లభిస్తుంది. పలు చోట్ల ఆమె రోడ్ షోలో ప్రసంగిస్తున్నారు.
ధనిక రాష్ట్రాన్ని....
ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని చెప్పారు. బంగారు తెలంగాణ ఏమైపోయిందని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో అసలు సమస్యలే లేవని కేసీఆర్, కేటీఆర్ చెబుతున్నారని, దమ్ముంటే తనతో పాదయాత్ర చేయాలని, సమస్యలు లేకపోతే తాను యాత్రను విరమించుకుని వెళతానని షర్మిల సవాల్ విసిరారు. లేకుంటే సీఎంగా రాజీనామా చేసి కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలన్నారు.
- Tags
- ys sharmila
- kcr
Next Story