Sun Dec 22 2024 23:40:50 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి షర్మిల పాదయాత్ర
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేటి నుంచి తిరిగి పాదయాత్రను ప్రారంభించనున్నారు
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేటి నుంచి తిరిగి పాదయాత్రను ప్రారంభించనున్నారు. గతంలో ప్రారంభించిన యాత్రను ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా షర్మిల నిలిపేశారు. తిరిగి ఈ రోజు నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం కానుంది. నల్లగొండ జిల్లా కొండపాకగూడెం నుంచి షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇందుకు తగిన ఏర్పాట్లను పార్టీ నిర్వాహకులు చూస్తున్నారు.
తిరిగి ప్రారంభం....
తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకోవాలని వైఎస్ షర్మిల పాదయాత్రను ప్రారంభించారు. తన తండ్రి బాటలోనే ఆమె కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దాదాపు 90 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా రూట్ మ్యాప్ ను రూపొందించారు. దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు యాత్ర కొనసాగించాలని నిర్ణయించారు. ఈ పాదయాత్రకు ప్రజాప్రస్థానం అని నామకరణం చేశారు. తిరిగి ఈరోజు నుంచి పాదయాత్ర ప్రారంభం కానుండటంతో ఆ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నెలకొంది.
Next Story