Sun Dec 22 2024 23:10:01 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి షర్మిల పాదయాత్ర.. కానీ?
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు తిరిగి పాదయాత్ర ప్రారంభించనున్నారు. పోలీసులు ఆమెకు షోకాజ్ నోటీసు ఇచ్చారు
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు తిరిగి పాదయాత్ర ప్రారంభించనున్నారు. నర్సంపేట నుంచే తిరిగి పాదయాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. హైకోర్టు అనుమతితతో షర్మిల తన పాదయాత్రను ప్రారంభిస్తున్నారు. అయితే పోలీసుల అనుమతి కోసం వైఎస్ షర్మిల పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. ఎందుకు నిరాకరించకూడదో చెప్పాలని వైఎస్ షర్మిలకు షోకాజ్ నోటీసులు జారీ చేవారు.
శాంతి భద్రతలకు....
తాము సూచించిన నియమ నిబంధనలను పాటించడం లేదని పోలీసులు భావిస్తున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగండం వల్లనే టెన్షన్ వాతావరణం నెలకొంటుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించేలా వ్యవహరిస్తే తిరిగి ఘర్షణలు చోటు చేసుకునే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల పాదయాత్ర ఎన్ని గంటలకు ప్రారంభమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అసలు పాదయాత్ర ప్రారంభమవుతుందా? లేదా? అన్నది కూడా చూడాల్సి ఉంది.
Next Story