Tue Dec 03 2024 17:43:39 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఖమ్మంలో వైఎస్ షర్మిల
ఖమ్మం జిల్లాలో ఈరోజు రేపు వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటించనున్నారు.రైతులను పరామర్శించనున్నారు
ఖమ్మం జిల్లాలో ఈరోజు రేపు వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. జిల్లాలోని వైరా, మధిర నియోజకవర్గాల్లో షర్మిల పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి జరిగిన పంట నష్టాన్ని స్వయంగా వైఎస్ షర్మిల పరిశీలించనున్నారు. రైతులను పరామర్శించి వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకోనున్నారు. నిన్న వరంగల్ జిల్లాలో పర్యటించిన వైఎస్ షర్మిల పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నష్టపరిహారాన్ని రైతులకు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
పంటనష్టం వివరాలను...
ఈరోజు ఉదయం 11.30 గంటలకు కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామం చేరుకుని పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకుంటారు. 12.30 గంటలకు బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో పర్యటించి అకాల వర్షానికి నష్టపోయిన రైతులను పరామర్శిస్తారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఇల్లందు నియోజకవర్గంలోని సాతాని గూడెంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను కూడా వైఎస్ షర్మిల పరిశీలిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story