Mon Dec 23 2024 12:26:46 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సిరిసిల్లకు వైఎస్ షర్మిల
సిరిసిల్లలో ఈరోజు వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న నవీన్ కుటుంబాన్ని పరామర్శిస్తారు
సిరిసిల్లలో ఈరోజు వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. ఉద్యోగం రాలేదని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నవీన్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు. అయితే షర్మిల పర్యటనకు పోలీసులు అనుమతిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. వైఎస్ షర్మిల మాత్రం తాను సిరిసిల్ల వెళ్లి తీరతానని చెబుతున్నారు.
పరామర్శకు...
రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం దీక్షలు తానే చేశానని, తన దీక్ష తర్వాతనే ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసిందని వైఎస్ షర్మిల చెబుతూ వస్తున్నారు. సిరిసిల్ల వస్తే ఇబ్బందిగా మారుతుందని ఆమె రాకను అడ్డుకునే ప్రయత్నం చేస్తారని కూడా పార్టీ శ్రేణులు అంటున్నాయి. వైఎస్ షర్మిల మాత్రం తాను సిరిసిల్ల వెళ్లి నవీన్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించి తీరతానని చెబుతున్నారు.
Next Story