Mon Dec 23 2024 08:40:27 GMT+0000 (Coordinated Universal Time)
క్షీణిస్తున్న వైఎస్ షర్మిల ఆరోగ్యం
వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల ఆరోగ్యం క్షీణించింది. 30 గంటలుగా దీక్ష చేస్తుండటంతో ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు చెప్పారు
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోగ్యం క్షీణించింది. గత ముప్ఫయి గంటలుగా ఆమె దీక్ష చేస్తుండటంతో ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు తెలిపారు. ఆమెకు వైద్య పరీక్షలను చేసిన వైద్యులు ఆమె ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్పారు. అరెస్ట్ చేసిన వైఎస్సార్టీపీ కార్యకర్తలను విడుదల చేయాలని, తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నిన్నటి నుంచి దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.
అక్రమ అరెస్ట్ లను...
తొలుత ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆమెను లోటస్ పాండ్ కు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పలువురు వైస్సార్టీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. లోటస్ పాండ్ కు తీసుకు వచ్చినా షర్మిల తన దీక్షను మాత్రం కొనసాగిస్తున్నారు. ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్యులు చెప్పడంతో ఆమె దీక్షను పోలీసులు భగ్నం చేసే అవకాశాలున్నాయి.
Next Story