Mon Mar 31 2025 10:05:03 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ షర్మిల @ 2000 కి.మీ
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర నేడు 2000 కి.మీ చేరుకోనుంది. ఈ సందర్బంగా పైలాన్ ను ఆవిష్కరించనున్నారు.

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర నేడు రెండు వేల కిలోమీటర్లకు చేరుకోనున్న సందర్బంగా వైఎస్సార్ పైలాన్ ను షర్మిల ఆవిష్కరించనున్నారు. నేడు 148వ రోజు వనపర్తి, దేవరకద్ర నియోజకవర్గాల్లో షర్మిల పర్యటన కొనసాగుతుంది. వనపర్తి మండలం రాజానగర్ కానలీ, రాజపేట మీదుగా దేవరకద్ర నియోజవకర్గంలోకి వైఎస్ షర్మిల అడుగు పెట్టనున్నారు. కొత్తకోట మండలం పరిధిలోని సంకిరెడ్డిపల్లి, ఎన్హెచ్ 44 మీదుగా కొత్తకోట టౌన్ కు చేరుకుంటారు.
భారీ బహిరంగ సభ...
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర తెలంగాణలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండు వేల కిలోమీటర్లకు నేడు చేరుకోవడంతో ఆ పార్టీ నేతలు ప్రత్యేకంగా పైలాన్ ను తయారు చేయించారు. పైలాన్ ను ఆవిష్కరించిన అనంతరం షర్మిల కొత్తకోట బస్టాండ్ లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. బహిరంగ సభకు జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా క్యార్యకర్తలు తరలిరానున్నారు.
Next Story