Mon Dec 23 2024 04:52:09 GMT+0000 (Coordinated Universal Time)
మార్చి 10 నుంచి షర్మిల పాదయాత్ర
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర తిరిగి ప్రారంభం కాబోతుంది. ఈ నెల 10నుంచి తిరిగి పాదయాత్ర ను ప్రారంభించనున్నారు.
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర తిరిగి ప్రారంభం కాబోతుంది. ఈ నెల 10వ తేదీ నుంచి తిరిగి పాదయాత్ర ను షర్మిల ప్రారంభించనున్నారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది డిసెంబరు 9 వతేదన షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను నిలిపేశారు. అప్పడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కోడ్ అమలులో ఉన్నందున తన పాదయాత్రను షర్మిల వాయిదా వేసుకున్నారు.
కొండపాక నుంచే....
నల్లగొండ జిల్లా కొండపాక గ్రామం వద్ద నిలిపేసిన ప్రజాప్రస్థానం పాదయాత్రను తిరిగి షర్మిల అక్కడి నుంచే ప్రారంభించనున్నారు. రోజుకు పది నుంచి పదిహేను కిలోమీటర్లు పాదయాత్ర చేయాలన్న లక్ష్యంతో షర్మిల బయలుదేరనున్నారు. సామాన్య ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుంటారు. షర్మిల పాదయాత్రకు పార్టీ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తుంది.
Next Story