Fri Dec 20 2024 07:33:34 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఆంధ్రా షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు ..!
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు ఊహించని షాక్
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గట్టు రామచంద్రరావు నేతృత్వంలో వైఎస్సార్టీపీ కి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు ఆ పార్టీ నేతలు. ఆంధ్ర షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడమే కాకుండా.. తెలంగాణ ప్రజలను మోసం చేసిన షర్మిల వెంటనే తెలంగాణను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.
గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ.. షర్మిల రాజశేఖర్ రెడ్డి పేరును చెడగొట్టారని అన్నారు. కాంగ్రెస్ తో పోరాడతా అని చెప్పి.. చివరికి ఆ పార్టీ చెంత చేరి మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టిందని విమర్శలు గుప్పించారు. ఇన్ని రోజులు షర్మిలను సపోర్ట్ చేసినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతున్నామన్నారు. మేమంతా షర్మిలను తెలంగాణ నుండి బహిష్కరిస్తున్నమని తెలిపారు. షర్మిల రాజకీయాలకు పనికిరాదని.. భవిష్యత్ కార్యచరణ త్వరలోనే చెబుతామన్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీతో షర్మిలకు ఎటువంటి సంబంధం లేదని, ఆమెకు సభ్యత్వమే లేదని ప్రకటించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ షర్మిలది కాదని గట్టు రామచంద్రా రావు అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులను షర్మిల మోసం చేశారని, తడి గుడ్డతో గొంతు కోశారన్నారు. భవిష్యత్తులో షర్మిల ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామన్నారు. షర్మిల మానసిక పరిస్థితి బాగాలేదని ఆరోపించారు. షర్మిలతో పోల్చుకుంటే కేఏ పాల్ చాలా బెటర్ అని చెప్పుకొచ్చారు.
Next Story