Fri Nov 22 2024 22:13:22 GMT+0000 (Coordinated Universal Time)
అప్పుడే పాదయాత్రను ముగిస్తా
తమ పాదయాత్రకు ఆటంకాలు లేకుండా తగిన భద్రత కల్పించాలంటూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డీజీపీని కోరారు
తమ పాదయాత్రకు ఆటంకాలు లేకుండా తగిన భద్రత కల్పించాలంటూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డీజీపీని కోరారు. కొద్దిసేపటి క్రితం ఆమె డీజీపిని కలసి వినతిపత్రం అందచేశారు. నర్సంపేటలో టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డంకులు సృష్టించారని, హైదరాబాద్ లోనూ పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. పాదయాత్ర నిలిచిన నర్సంపేట నుంచే తాను తిరిగి పాదయాత్ర చేయనున్నట్లు ఆమె తెలిపారు.
ప్రభుత్వ వైఫల్యాలను...
నాలుగు వేల కిలోమీటర్లు పూర్తయిన తర్వాత తాను పాదయాత్రను రాష్ట్రంలో ముగిస్తానని వైఎస్ షర్మిల తెలిపారు. డిసెంబరు 14న పాదయాత్రను ముగిస్తానని ఆమె చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను తాను పాదయాత్రలో ప్రజాసమక్షంలో ఎండగట్టానని ఆమె చెప్పారు. ప్రజలు తనపై జరుగుతున్న దాడులను గమనించాలని ఆమె కోరారు. కేసీఆర్ వైఫల్యాలను ప్రతిరోజూ ప్రజలకు చెబుతూనే ఉంటానని షర్మిల తెలిపారు. కేసీఆర్ బిడ్డ కవిత లిక్కర్ స్కాంలో కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ కొడుకు రియల్ ఎస్టేట్ దందా చేస్తూ దోచుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రజలపై భారం మోపుతున్నారని షర్మిల ఆరోపించారు.
- Tags
- ys sharmila
- dgp
Next Story