Mon Dec 23 2024 14:06:10 GMT+0000 (Coordinated Universal Time)
భరోసాను పక్కన పెట్టిన కేసీఆర్
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైఎస్సార్ తెచ్చిన అభయ హస్తం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె మండి పడ్డారు. ట్విట్టర్ లో వైఎస్ షర్మిల ప్రభుత్వం తీరును ఎండట్టారు. పొదుపు సంఘాల మహిళలకు వృద్ధాప్యంలో ఆర్థికంగా భరోసా ఉండాలని గతంలో వైఎస్ అభయ హస్తం పథకాన్ని ప్రారంభించారని ఆమె గుర్తు చేశారు.
వైఎస్ తెచ్చిన.....
ఈ పథకం 2017 వరకూ అమలయిందని, తర్వాత పథకంలో మార్పులు తెస్తామని చెప్పిన కేసీఆర్ పూర్తిగా అటకెక్కించారని షర్మిల ఫైర్ అయ్యారు. అభయ హస్తం పథకం కింద మహిళలు చెల్లించిన సొమ్ములు కూడా తిరిగి ఇవ్వలేదన్నారు. వృద్ధాప్యంలో మహిళలకు భరోసా లేకుండా చేశారన్నారు.
- Tags
- ys sharmila
- ysrtp
Next Story