Tue Nov 05 2024 16:26:11 GMT+0000 (Coordinated Universal Time)
వికారాబాద్ లో షర్మిల టూర్
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. పంట నష్టాన్ని పరిశీలించారు.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలం అమ్రవాది కుర్ధ్ గ్రామంలో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు. వడగండ్ల వానకు సర్వం నష్టపోయామని వైఎస్ షర్మిలకు రైతులు వివరించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ వడగళ్ల వానతో ఒక్క వికారాబాద్ జిల్లాలోనే కనీసం ఆరు వేల ఎకరాలలో పంట నష్టం జరిగిందన్నారు. రైతు నష్ట పోయాడని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తుందని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
పరిహారం చెల్లించాల్సిందే...
ఇంత వరకు ఒక్కరూ కూడా పరిశీలన కు రాలేదని, ఎంత నష్టం జరిగింది అనేది అంచనా కూడా లేదని వైఎస్ షర్మిల అన్నారు. పరిహారం ఇచ్చే దిక్కు కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు వేయించుకోవడానికి తప్ప రైతులు ఎలా బ్రతుకు తున్నారు అని పట్టింపు ఈ ప్రభుత్వానికి లేదని వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, 1250 కోట్ల మేర నష్టం జరిగినట్లు అంచనా ఉందని ఆమె అన్నారు. నష్టపోయిన పంటలకు వెంటనే పరిహారం చెల్లించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Next Story