Fri Nov 22 2024 13:43:38 GMT+0000 (Coordinated Universal Time)
అన్న నిర్ణయాన్ని తప్పుపట్టిన షర్మిల..
ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా పేర్లు మార్చుతూ పోతే దానికున్న విలువ పోతుందని..
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఉన్న హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరు పెట్టడాన్ని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తప్పుపట్టారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా పేర్లు మార్చుతూ పోతే దానికున్న విలువ పోతుందని ఆమె అభిప్రాయపడ్డారు. యూనివర్శిటీ, స్టేడియం తదితర వాటికి ఒక వ్యక్తి పేరు పెట్టడం వెనుక కారణాలుంటాయని, వాటిని అలాగే కొనసాగిస్తే.. తరతరాలుగా ఆ కుటుంబానికి గౌరవం ఉంటుందన్నారు. ఒక్కొక్కరు ఒక్కో పేరు పెట్టుకుంటూ పోతే... ఎవరు ఏం చేస్తున్నారో కూడా జనాలకు అర్థంకాకుండా పోతుందని అన్నారు.
తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న షర్మిల.. మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే వైఎస్సార్ ను కాంగ్రెస్ విస్మరించిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో తన తండ్రి పేరును వాడుకుని, ఎన్నికలయ్యాక మర్చిపోతారని మండిపడ్డారు. వైఎస్సార్ కు తానే అసలైన రాజకీయ వారసురాలినని పునరుద్ఘాటించారు.
Next Story