కాకినాడలో వైసిపికి స్టార్ హీరో ఫ్యాన్స్ మద్దతు
నంద్యాల ఉప ఎన్నికల వేడి చల్లారకుండానే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు కంటిన్యూ అవుతుండటంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది . తాజాగా సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరిరావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి . కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కృష్ణ , మహేష్ బాబు ఫ్యాన్స్ లు వైసిపి గెలుపుకోసం పని చేస్తాయంటూ శేషగిరిరావు వ్యాఖ్యానించారు . కృష్ణ సోదరుడు వైసిపిలో చేరి చాలా కాలమే అయ్యింది . ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చిన ఆయన కృష్ణ , మహేష్ ఫ్యాన్స్ నాయకులతో సమావేశం అయి ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం .
ఆదిశేషగిరిరావు వ్యాఖ్యలు వారికి సమ్మతమేనా ..?
వాస్తవానికి సూపర్ స్టార్ కృష్ణ రాజకీయపరంగా టిడిపి ని తొలినుంచి వ్యతిరేకిస్తూనే వచ్చారు . ఆయన రాజీవ్ గాంధీ కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తే అందులో చేరి ఏలూరు నుంచి పోటీ చేశారు కూడా . ఎన్టీఆర్ పై మండలాధీశుడు వంటి చిత్రాలతో ఆయనకు నేరుగా తొడ కొట్టారు కృష్ణ . రాజీవ్ గాంధీ మరణానంతరం సూపర్ స్టార్ రాజకీయాలకు దూరంగా వుంటూ వచ్చారు . తన కుటుంబంతో గల్లా అరుణ వియ్యం అందుకోవడం ఆమె కాంగ్రెస్ లో ఉన్నందున ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది . స్వర్గీయ వైఎస్ తో కూడా కృష్ణ కుటుంబం సన్నిహితంగా మెలిగేది . రాష్ట్ర విభజన తరువాత గల్లా కుటుంబం టిడిపిలో చేరడం అరుణ కుమారుడు కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ ఎంపీ గా గెలవడం జరిగాయి . తన బావ విజయానికి మహేష్ సైతం ప్రచారం చేశారు . ఆ తరువాత కృష్ణ సోదరుడు వైసిపిలో చేరడం జరిగింది . అయినప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ , ప్రిన్స్ మహేష్ బాబులు ఏ పార్టీ రాజకీయ వేదికలపై చొక్కా చింపుకొని తాము ఫలానా పార్టీ తరపున అంటూ ప్రచారం చేయలేదు . తాజాగా ఘట్టమనేని ఆది శేషగిరిరావు వైసిపి తరపు సాగిస్తున్న ఈ ప్రచారంపై స్టార్ హీరోస్ కృష్ణ మహేష్ లు ఏవిధంగా స్పందిస్తారో, వారి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి