చిగురుటాకులా వణికిన హైదరాబాద్
శుక్రవారం సాయంత్రం నుంచి కురుస్తోన్న భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దయింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలశయాలను తలపిస్తున్నాయి. నగరంలోని పలు జంక్షన్లలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షపు నీటితో రోడ్లన్ని జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎమర్జెన్సీ బృందాలను జీహెచ్ఎంసీ రంగంలోకి దింపే యోచనలో ఉంది.
భారీ వర్షాలతో అతలాకుతలం.......
నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, క్రిష్ణానగర్, మెహిదీపట్నం, దిల్సుఖ్నగర్, మలక్పేట్, పంజాగుట్ట, అమీర్పేట, ఎల్బీ నగర్, ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం తలెత్తడంతో కొన్ని ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి. మరోవైపు నేడు వినాయక చవితి పండుగను పురస్కరించుకుని భక్తులు తాము సిద్ధం చేసుకున్న మండపాల వద్దకు స్వామివారి విగ్రహాలను తీసుకెళ్తున్న వారికి అవాంతరాలు ఎదురవుతున్నాయి.
- Tags
- భారీ వర్షం