Sat Dec 28 2024 11:32:14 GMT+0000 (Coordinated Universal Time)
డేరా బాబాకే గురువు చంద్రబాబా: కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డేరా బాబాకే గురువని వైసీీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రంగా విమర్శించారు. జగన్ ను డేరా బాబా అన్న చంద్రబాబు అసలైన డేరా బాబా అని కొడాలి నాని ఎదురుదాడి చేశారు. నిజంగా చంద్రబాబుకు దమ్ము...ధైర్యముంటే పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలున్న 20 నియోజకవర్గాల్లోనూ ఎన్నికలు జరపాలని నాని డిమాండ్ చేశారు. నిజంగా చంద్రబాబుకు తన పాలనపైన, తనపైన నమ్మకుంటే ఎన్నికలు జరిపించాలన్నారు. నంద్యాలలో అభివృద్ధి చూసి ప్రజలు ఓటెయ్యలేదని, సానుభూతి, డబ్బు ప్రభావం వల్లనే టీడీపీ విజయం సాధ్యమైందన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు ఎంపీ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికలలో టీడీపీకి డిపాజిట్ రాని విషయాన్ని ఈ సందర్భంా నాని గుర్తు చేశారు.
- Tags
- చంద్రబాబు నాని
Next Story