Thu Dec 26 2024 01:21:58 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : నంద్యాలలో మళ్లీ టెన్షన్
నంద్యాలలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. నంద్యాల ఆత్మకూరు బస్టాండ్ వద్ద శిల్పా చక్రపాణిరెడ్డి, రవిలతో భూమా నాగిరెడ్డి కుమారుడు జగత్, కుమార్తె మౌనిక ఘర్షణ పడ్డారు. దీంతో ఆత్మకూరు బస్తాండ్ వద్ద నంద్యాలలో టెన్షన్ నెలకొంది. భావావేశాలను అదుపుకో చేసుకోలేక ఈ రెండు వర్గాలు ఘర్షణ పడినట్లు తెలిసింది. శిల్పా, భూమా కుటుంబాలు వాగ్వాదానికి దిగడంతో రెండు వర్గాలూ పెద్దయెత్తున మొహరించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పోలింగ్ చివరి నిమిషంలో నంద్యాలలో టెన్షన్ నెలకొంది. అక్కడే ఎమ్మెల్సీ ఫరూక్ కూడా ఉన్నారు. ఫరూక్ ఇరు వర్గాలకూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
Next Story