జాతీయ జెండా విషయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా? అయితే జైలుకే!
దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే జరుపుకొంటోంది. ఆగస్టు 15న దేశ వ్యాప్తంగా జాతీయ జెండా ఎగురవేస్తుంటాము. జాతీయ జెండా ఎగురవేసే..
దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే జరుపుకొంటోంది. ఆగస్టు 15న దేశ వ్యాప్తంగా జాతీయ జెండా ఎగురవేస్తుంటాము. జాతీయ జెండా ఎగురవేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. జెండా ఎగురవేసే సమయంలో చాలా మంది చాలా పొరపాట్లు చేస్తుంటారు. కొందరు తెలిసి పొరపాట్లు చేస్తుంటే.. మరి కొందరరు తెలియక పొరపాట్లు చేస్తుంటారు. అయితే జాయతీ జెండా ఎగరవేసే ముందు నియమ నిబంధనలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. చిన్నపాటి పొరపాటు జరిగినా జాతీయ జెండాను అవమానించిన వారమవుతామని గుర్తించుకోవాలి. అందుకే జెండాను ఆవిష్కరించే ముందు నిబంధనలు ఎట్టి పరిస్థిలో ఉల్లంఘించకూడదు. లేదంటే వారిపై శిక్షలు పడడమే కాకుండా జరిమానాలు కూడా చెల్లించే పరిస్థితి రావచ్చు. జెండా విషయంలో తప్పులు చేస్తే కేసు నమోదై కనీసం మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అందుకే జాతీయ జెండాను ఎగురవేసే సమయంలో నియమ నిబంధనలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరి జాతీయ జెండాను ఎగురవేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
జాతీయ జెండా విషయంలో నిబంధనలు ఇవే..
☛ జాతీయ జెండాను గౌరవంతో చూసుకోవాలి.
☛ జాతీయ జెండా పొడవు 3:2 నిష్పత్తిలో ఉండాలి.
☛ ఈ జెండా చేనేత ఖాదీ, కాటన్ వస్త్రంతో తయారు చేసి ఉండాలి.
☛ జెండా చిరిగినది ఉండకూడదు. అలాగే పాతబడినట్లుగా, నలిగిపోయినట్లుగా ఉండకూడదు.
☛ జెండా మధ్యలో ఉండే ధర్మచక్రంలో 24 ఆకులు ఉండాలి.
☛ జెండా ఎగరవేసే ఎత్తుకుపైగా మరే ఇతర జెండాలు ఎగురవేయకూడదు.
☛ జెండాను పైకి ఎగురవేసేటప్పుడు కర్రకు జెండా కుడివైపున ఉండాలి.
☛ జాతీయ జెండాను దుస్తులుగా కుట్టించుకోకూడదు.
☛ జెండాను సరైన స్థలంలో ఉంచాలి.
☛ జాతీయ జెండా ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పడేయకూడదు.
☛ జెండా ఆవిష్కరించే సమయంలో చిరిగిపోకూడదు.
☛ జెండాపై ఎలాంటి గీతలు ఉండకూడదు.
☛ జెండా ఎగురవేసేటప్పుడు తలకిందులుగా ఎగురవేయకూడదు. ఏ రంగు పైకి ఉండాలి. ఏ రంగు కింది ఉండాలన్నది జాగ్రత్తగా చూసుకోవాలి.
☛ కాషాయం రంగు పైకి ఉంటే.. ఆకుపచ్చ రంగు దిగువన ఉండాలి.
☛ జాతీయ జెండాపై మూడు రంగులు సమానంగా ఉండాలి.
.☛ అలంకరణకు జాతీయ జెండా ఎట్టి పరిస్థితులలో ఉపయోగించరాదు.
☛ జెండా కర్ర నిటారుగా ఉండాలి. కిందికి వచ్చినట్లుగా ఉండకూడదు
☛ జెండాను దుర్వినియోగం చేసినా శిక్ష తప్పదు
☛ జాతీయ జెండాను ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు. అలా చేసిన తప్పే.
☛ జాతీయ జెండాను నిదానంగా ఎగురవేయాలి.
☛ జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సాయంత్రం కిందకు దించేయాలి.
☛ జెండాను పువ్వులతో గానీ, కాగితాలతో, ఇతర రంగులతో అలంకరించకూడదు.
☛ మొత్తం మీద జాతీయ జెండాకు ఏ విధంగానై అవమానించకూడదు.