Mon Dec 23 2024 09:29:21 GMT+0000 (Coordinated Universal Time)
కరోనా కల్లోలం.. ఒకేవిమానంలో 125 మందికి పాజిటివ్ !
ఇటలీ నుంచి పంజాబ్ లోని అమృత్ సర్ కి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలోని ప్రయాణికులందరికీ కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయగా..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఏ స్థాయిలో అలజడి రేపుతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే భారత్ లోకి థర్డ్ వేవ్ ఎంటరైందంటూ ఆరోగ్య శాఖ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లోనే ఎక్కువగా ఒమిక్రాన్ కేసులు బయటపడుతుండటంతో.. తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎయిర్ పోర్టుల్లోనే కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేసి, పాజిటివ్ గా తేలిన వారిని హోమ్ ఐసోలేషన్ లేదా ప్రభుత్వ క్వారంటైన్లకు పంపుతున్నారు. కాగా.. తాజాగా ఎయిర్ ఇండియా విమానంలో కరనా కల్లోలం సృష్టించింది.
Also Read : ఏపీలో ఇంటర్ కాలేజీలకు సెలవులు !
ఇటలీ నుంచి పంజాబ్ లోని అమృత్ సర్ కి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలోని ప్రయాణికులందరికీ కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయగా.. ఏకంగా 125 మంది పాజిటివ్ గా తేలింది. దీంతో వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్స్ కు పంపించారు వైద్య అధికారులు. ప్రస్తుతం 125 మంది ప్రయాణికులను ఐసోలేషన్ లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఇంతభారీ మొత్తంలో కోవిడ్ కేసులు వెలుగుచూడటం ఇదే తొలిసారి.
Next Story