20 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా....?
నంద్యాల ఉప ఎన్నికలో సాధించిన గెలుపుతో టీడీపీ మిగిలిన స్థానాలకు పోటీ చేసే సాహసం చేస్తుందా... ఇప్పుడు ఇదే హాట్ టాపిక్., ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం విజయాన్ని సాధించింది. అదే సమయంలో టీడీపీలో మంత్రి పదవులు అనుభవిస్తోన్న ఎమ్మెల్యేలతో పాటు., 20మంది. ఎమ్మెల్యే లు రాజీనామా చేసి పోటీకి దిగాలి అని వైసీపీ సవాల్ చేస్తోంది. నిజానికి నంద్యాలలో టీడీపీ ఓడిపోతే మంత్రి పదవి వదులుకుంటానని అఖిల సవాల్ చేశారు. తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని శిల్ప సవాల్ చేశారు. దీనికి అఖిల స్పందించలేదు. నంద్యాలలో టీడీపీ గెలుపు ఏక పక్షంగా విజయాన్ని సాధించుకోవడంతో వైసీపీ మిగిలిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి సత్తా నిరూపించుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే నంద్యాల మాదిరి ప్రతి చోట సవాలును స్వీకరించేంత తెలివి తక్కువ పని చంద్రబాబు చేస్తారనుకోలేము.