Fri Nov 22 2024 17:00:57 GMT+0000 (Coordinated Universal Time)
భారీ భూకంపం.. 25 మంది మృతి
పశ్చిమ ఆప్ఘనిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తులో 25 మంది వరకూ మృతి చెందినట్లు స్థానిక అధికారులు
పశ్చిమ ఆప్ఘనిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తులో 25 మంది వరకూ మృతి చెందినట్లు స్థానిక అధికారులు భావిస్తున్నారు. పశ్చిమ అఫ్గాన్లోని ముక్వార్, క్వాదీస్ జిల్లాల్లో సోమవారం (జనవరి 17,2022) రాత్రి కేవలం నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. పశ్చిమ ప్రావిన్స్ బాద్గీస్లోని ఖదీస్ జిల్లాలో పలు ఇళ్ల పైకప్పులు కూలిపోవడంతో బాధితులు మరణించారని బాజ్ మహ్మద్ సర్వారీ అనే అధికారి తెలిపారు.
బాద్గీస్ పశ్చిమ ప్రావిన్సులోని ఖాదీస్ జిల్లాలో ఇళ్ల పైకప్పులు మీదపడటంతో 26 మంది మృతిచెందినట్లు తాలిబన్ అధికార ప్రతినిధి బాజ్ మొహమ్మద్ సర్వారీ తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు చిన్నారులున్నట్లు సమాచారం. ఈ విపత్తులో చాలామందికి తీవ్రగాయాలవ్వగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. భూకంపం కారణంగా ఎంత మేరకు ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందో పూర్తిగా తెలియాల్సి ఉందని సర్వారీ పేర్కొన్నారు.
Next Story