4-7-8 గురించి మీకు తెలుసా!
ఆధునిక యుగంలో స్ట్రెస్ గురించి వేరే చెప్పక్కర్లేదు. చదువు, ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితాల్లో వత్తిడి తప్పడం లేదు. శారీరక వ్యాయామాలు ఎన్ని చేసినా, స్ట్రెస్‌ను జయించడం కష్టమవుతోంది. ధ్యానం, ప్రాణాయామం లాంటివి చేద్దామన్నా కొందరికి టైం కుదరడం లేదు. దీనికోసం ఓ పాశ్చాత్య వైద్యుడు 4-7-8 టెక్నిక్‌ను సూచిస్తున్నాడు. ఆండ్రూ వీయల్ అనే అమెరికన్ ఫిజీషియన్ భారతీయ ప్రాణాయామం ఆధారంగా 4-7-8 అనే ధ్యాన పద్ధతిని రూపొందించారు. దీనివల్ల వత్తిడి, నిద్రలేమి, గుండె దడ లాంటివి తగ్గుతాయని ఆయన చెబుతున్నారు.

అసలు 4-7-8 అంటే ఏమిటి? ఓ దగ్గర కుదురుగా, ప్రశాంతంగా కూర్చుని నాలుగు సెకన్ల పాటు శ్వాస తీసుకోవాలి. ఏడు సెకన్లపాటు ఆ శ్వాసను నిలిపి ఉంచాలి. అంటే ఊపిరి బిగపెట్టి ఉండాలి. ఎనిమిది సెకన్ల పాటు శ్వాసను మెల్లగా బయటకు వదలాలి. ఇది ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎన్ని సార్లయినా చేయవచ్చు. కానీ మంచి ఫలితాలు రావాలంటే.. రోజూ కాసేపు ఈ ధ్యానాన్ని చేయాలి. దీనివల్ల క్రమేపీ మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ పద్ధతిని రోజూ పాటించడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని ఆండ్రూ చెబుతున్నారు. కోపాన్ని నియంత్రించుకోవడం, ఆందోళనను తగ్గించుకోవడం, నిద్రలేమి సమస్య నుంచి బయటపడటం, బీపీ, గుండె దడ నియంత్రణ, మైగ్రేన్ తలనొప్పి నియంత్రణ లాంటి చాలా శారీరక, మానసిక సమస్యలకు 4-7-8 టెక్నిక్ మంచి పరిష్కారమని ఆండ్రూ తెలిపారు.
ఆండ్రూ చెప్పిన ఈ టెక్నిక్ కూడా ఓ రకమైన ధ్యానం లాంటిదే. దీనిని నిరంతరంగా పాటించాలి. కొన్ని వారాలు, కొన్నిసార్లు నెలల తర్వాత మంచి ఫలితాలు కనిపిస్తాయిని ఈ అమెరికన్ డాక్టర్ చెబుతున్నారు. ధ్యానం, ప్రాణాయామం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి సుదర్శన క్రియ, సద్గురు సూచించే మ్యూజిక్ మెడిటేషన్.... వీటి లక్ష్యం కూడా వత్తిడి నివారణే. వీటిలో ఏదో ఒక దానిని రోజూ పాటిస్తే ప్రశాంతంగా ఉండొచ్చు.