Sat Nov 23 2024 11:14:01 GMT+0000 (Coordinated Universal Time)
మసీదులో పేలిన బాంబు.. 45 మంది మృతి, 65మందికి పైగా గాయాలు
పెషావర్ సిటీ పోలీస్ అధికారి ఇజాజ్ అషాన్ మాట్లాడుతూ.. పేలుడు ఘటనలో ఓ పోలీస్ అధికారి కూడా మృతి చెందినట్లు తెలిపారు. పెషావర్..
పాకిస్థాన్ పెషావర్ లో ఉన్న ఓ మసీదులో బాంబా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 45 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 65 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కొచ్చా రిసాల్దార్ లోని మసీదులో ఈ బాంబు పేలుడు జరిగింది. సూసైడ్ బాంబ్ అటాక్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక లేడీ రీడింగ్ ఆస్పత్రికి చెందిన అధికారులు మృతదేహాలను గుర్తించే పనిలో ఉన్నారు.
Also Read : విషాదం : పాముకాటు ఘటనలో ఓ విద్యార్థి మృతి
పెషావర్ సిటీ పోలీస్ అధికారి ఇజాజ్ అషాన్ మాట్లాడుతూ.. పేలుడు ఘటనలో ఓ పోలీస్ అధికారి కూడా మృతి చెందినట్లు తెలిపారు. పెషావర్ లోని కిస్సా ఖవాని బజార్ లో ఉన్న మసీదులోకి ఇద్దరు సాయుధులు చొరబడే ప్రయత్నం చేశారు. తొలుత అక్కడ భద్రత కల్పిస్తున్న పోలీసులపై కాల్పులు జరపడంతో ఓ పోలీస్ మృతి చెందగా.. మరో పోలీస్ కు గాయాలయ్యాయి. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో.. కిస్సా ఖవాని బజార్ అంతా రద్దీగా ఉంటుంది. ఆ సమయంలోనే ఆత్మాహూతి దాడి జరగడంతో పదుల సంఖ్యలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కాగా.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ బాంబుదాడిని ఖండించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.
Next Story