Mon Dec 23 2024 19:22:53 GMT+0000 (Coordinated Universal Time)
త్వరపడండి.. ఇంకా మూడ్రోజులే సమయం.. చలాన్లు కట్టేయండి
చలాన్ల క్లియరెన్స్ లలో ఇచ్చిన డిస్కౌంట్లలో.. టూ వీలర్/ త్రీ వీలర్ వెహికల్స్ పై ఉన్న చలాన్లపై 75శాతం డిస్కౌంట్ ఉంది. అలాగే ఫోర్ వీలర్ ,
హైదరాబాద్ : తెలంగాణలో భారీగా పేరుకుపోయిన వాహన చలాన్లను క్లియర్ చేసుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన భారీ డిస్కౌంట్ ఆఫర్ మరో మూడ్రోజుల్లో ముగియనుంది. ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రానికి ఈ ఆఫర్ ముగుస్తోంది. మళ్లీ మళ్లీ ఆఫర్ ను పొడిగించే ఛాన్స్ లేదు కాబట్టి.. మీ వాహనాలపై ఉన్న చలాన్లను వెంటనే క్లియర్ చేసుకోవాలని నగర ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఎవరికైనా తెలియకపోతే ఈ విషయాన్ని తెలియజేయాలని సూచించారు.
చలాన్ల క్లియరెన్స్ లలో ఇచ్చిన డిస్కౌంట్లలో.. టూ వీలర్/ త్రీ వీలర్ వెహికల్స్ పై ఉన్న చలాన్లపై 75శాతం డిస్కౌండ్ ఉంది. అలాగే ఫోర్ వీలర్ , హెవీ వెహికల్స్ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్, కరోనా సమయంలో మాస్కు పెట్టుకోని కారణంగా వేసిన కేసులలో 90 శాతం డిస్కౌంట్ ఇచ్చింది ప్రభుత్వం. ఆటోలపై ఉన్న చలాన్లు 70 శాతం డిస్కౌంట్ తో క్లియర్ చేసుకునే అవకాశం ఉంది. డిస్కౌంట్ ప్రకటించిన తర్వాత భారీ మొత్తంలో వాహనదారులు చలాన్లను క్లియర్ చేసుకోవడం విశేషం. ఫలితంగా ప్రభుత్వానికి కోట్ల రూపాయల్లో ఆదాయం వచ్చింది. మూడ్రోజుల్లో డెడ్ లైన్ ముగుస్తుండగా.. వాహనదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, నెట్ బ్యాంకింగ్ లేదా పేటీఎం ద్వారా లేదా దగ్గర్లోని మీసేవ కేంద్రంలో సంప్రదించి వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
Next Story