Mon Dec 23 2024 08:25:29 GMT+0000 (Coordinated Universal Time)
నవోదయ విద్యాలయంలో కరోనా కలకలం.. 85 మందికి పాజిటివ్ ?
తొలుత స్కూల్ లో 11 మందికి కరోనా నిర్థారణ అవ్వగా.. అప్రమత్తమైన ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ స్కూల్ లో చదువుతోన్న మిగతా 488 మంది
ఇప్పుడిప్పుడే ఆన్ లైన్ పాఠాలకు స్వస్తి చెప్పి.. రెగ్యులర్ గా స్కూళ్లు తెరచుకుంటున్నారు. ఈ తరుణంలో కరోనా కల్లోలం రేపుతోంది. తాజాగా ఉత్తరాఖండ్ లోని ఓ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. నైనిటాల్ జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఏకంగా 85 మంది విద్యార్థులకు పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీంతో ఆ విద్యార్థులందరినీ హాస్టళ్లలోనే ఐసోలేషన్ లో ఉంచి, చికిత్స అందిస్తున్నారు. భారీమొత్తంలో విద్యార్థులకు కరోనా సోకడంతో ఆ స్కూల్ ను చిన్నపాటి కంటైన్మెంట్ జోన్ గా మార్చేశారు.
తొలుత స్కూల్ లో 11 మందికి కరోనా నిర్థారణ అవ్వగా.. అప్రమత్తమైన ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ స్కూల్ లో చదువుతోన్న మిగతా 488 మంది విద్యార్థుల నుంచి శాంపిళ్లు సేకరించి కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించింది. దీంతో మొత్తం 85 మందికి కోవిడ్ సోకినట్లు నిర్థారణ అయింది. దాంతో వారందరినీ వివిధ హాస్టళ్లలోనే ఐసోలేషన్ చేసి, చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులందరికీ కోవిడ్ నెగిటివ్ వచ్చాకే వారి వారి ఇళ్లకు పంపిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. ఆ స్కూల్లో చదువుతోన్న విద్యార్థుల్లో 70 శాతం మంది జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సమాచారం.
Next Story