Mon Dec 16 2024 06:47:34 GMT+0000 (Coordinated Universal Time)
బర్రెలక్క బాటలో... గల్ఫ్ అభ్యర్థి
అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్యులు సైతం సంచనాలు సృష్టించగలరు అని కొల్లాపూర్ లో ఇండిపెండెంటు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బర్రెలక్క (శిరీష) నిరూపించారు. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుతో నిర్మల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న స్వదేశ్ పరికిపండ్ల బర్రెలన్నగా మారి
నిర్మల్ లో బర్రెలన్న స్వదేశ్
అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్యులు సైతం సంచనాలు సృష్టించగలరు అని కొల్లాపూర్ లో ఇండిపెండెంటు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బర్రెలక్క (శిరీష) నిరూపించారు. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుతో నిర్మల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న స్వదేశ్ పరికిపండ్ల బర్రెలన్నగా మారి రాణాపూర్ గ్రామంలో ఆదివారం (26.11.2023) బర్రెల మంద సాక్షిగా బర్రెలక్క శిరీషకు సంఘీభావం ప్రకటించారు.
గల్ఫ్ కార్మికుల మద్దతుతో నిర్మల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న స్వదేశ్ ఈ సందర్బంగా మాట్లాడుతూ డబుల్ ఎమ్మే, బీఈడి చదివిన తనకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని, ప్రవాసి మిత్ర కార్మిక సంఘం స్థాపించి గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నానని అన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఐదు స్థానాల్లో సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, ధర్మపురి, నిర్మల్ నుంచి గల్ఫ్ సంఘాల నాయకులు పోటీలో ఉన్నారని స్వదేశ్ తెలిపారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ స్పూర్తితో కార్పొరేట్ రాజకీయ శక్తులను ఎదుర్కొంటున్నామని, గరీబు గల్ఫ్ కార్మికుల పక్షాన తాము పోటీ చేయడమే గెలుపుతో సమానమని ఆయన అన్నారు.
Next Story