Fri Dec 20 2024 06:46:48 GMT+0000 (Coordinated Universal Time)
నిమిషాల్లోనే వైరల్ గా మారిన ఫొటో
మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, జూనియర్ ఎన్టీఆర్ లు కలసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది
మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, జూనియర్ ఎన్టీఆర్ లు కలసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాత ఫొటో అయినప్పటికీ దీనిపై నెటిజెన్లు కామెంట్స్ జోరుగా చేస్తున్నారు. షేర్లు కూడా చేస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాజీ మంత్రి కొడాలి నాని కాళ్లపై కాలు వేసి కూర్చున్నారు. కొడాలి నాని మాత్రం ఇదేమీ పట్టించుకోనట్లు ఉన్నారు. వారి మధ్య హాస్యకరమైన సంభాషణ కొనసాగుతున్నట్లు ఫొటోను చూస్తే అర్థమవుతుంది.జోకను జూనియర్ ఎన్టీఆర్ పేల్చగా వల్లభనేని వంశీ దానిని ఆస్వాదిస్తూ కన్పించడం, కొడాలి నాని మాత్రం సీరియస్ గా పని చేసుకుంటుండటం ఆసక్తిని రేపుతుంది.
కొడాలి పై కాలు వేసి...
మధ్యలో కొడాలి నాని కూర్చుకోగా ఒక వైపు జూనియర్ ఎన్టీఆర్, మరో వైపు వల్లభనేని వంశీ కూర్చుని ఉన్నారు. ముగ్గురూ మంచి మిత్రులని ఈ ఫొటో చెప్పకనే చెబుతుంది. ఎప్పుడో సినిమా షూటింగ్ సందర్భంగా తీసిన ఫొటోగా ఇది కన్పిస్తుంది. కొడాలి నాని, వల్లభనేని వంశీలు గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో కొన్ని చిత్రాలను నిర్మించారు. ఆ సందర్భంగా తీసిన ఫొటో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంది. జూనియర్ ఎన్టీఆర్ ను చూస్తే ఇది ఆయన టాలివుడ్ లోకి ప్రవేశించిన తొలినాళ్లలో తీసిన చిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story