Mon Dec 23 2024 13:58:31 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో మరో పర్యాటక అద్భుతం.. సాగర్ తీరంలో లేక్ వ్యూ డెక్ !
రష్యా రాజధాని మాస్కోలోని ప్రఖ్యాత పర్యాటక స్థలం ఫ్లోటింగ్ బ్రిడ్జిను పోలిన బ్రిడ్జి.. ఇప్పుడు మన హైదరాబాద్‌లో రాబోతోంది.
హైదరాబాద్.. ఇక్కడ ఐటీ కంపెనీలు, ఉద్యోగాలకు కొదువ ఉండదు. అలాగే పర్యాటకానికి కూడా ఏమాత్రం తీసిపోదు. చార్మినార్, గోల్కొండ, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్, బిర్లా మందిర్, వాటర్ వరల్డ్ ఇలా చాలా పర్యాటక ప్రదేశాలున్నాయి భాగ్యనగరంలో. అలాంటి భాగ్యనగరానికి మరో పర్యాటక అద్భుత్వం రాబోతోంది. జంట నగరాలను కలిపి హుస్సేన్ సాగర్ తీరంలో ఆ అద్భుతం ఆవిష్కృతం కానుంది.
రష్యా రాజధాని మాస్కోలోని ప్రఖ్యాత పర్యాటక స్థలం ఫ్లోటింగ్ బ్రిడ్జిను పోలిన బ్రిడ్జి.. ఇప్పుడు మన హైదరాబాద్‌లో రాబోతోంది.. పీవీఎన్ఆర్ మార్గ్‌లో అంటే నెక్లెస్ రోడ్డులో హుస్సేన్ సాగర్ మీద ఈ ఏడాది చివరికల్లా ఆ పర్యాటక అద్భుతం నగరవాసులను థ్రిల్ చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద కుమార్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Next Story