ఒక్క రిపోర్ట్ కు ఏడు లక్షలా?
ఒక్కో పక్క రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ అధికారుల అక్రమాలు బయట పెడుతున్నారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న టౌన్ [more]
ఒక్కో పక్క రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ అధికారుల అక్రమాలు బయట పెడుతున్నారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న టౌన్ [more]
ఒక్కో పక్క రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ అధికారుల అక్రమాలు బయట పెడుతున్నారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులకు భయం లేకుండా పోతుంది. ఎందుకంటే ఈ సంఘటన చూస్తే మీకే అర్థమవుతుంది. రెండు రోజులుగా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నప్పటికీ అనంతపురంలోని ఒక టౌన్ ప్లానింగ్ అధికారులు ఏకంగా ఏడు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఏడు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ సర్వే కోటేశ్వరరావు ఏసీబీ వలలో అడ్డంగా దొరికిపోయాడు. ప్రసాద్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రసాద్ కు చెందిన సంబంధించిన లాండ్ సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి ఈ ఏడు లక్షల రూపాయల లంచం తీసుకున్నాడని విచారణలో వెల్లడయింది.