Mon Dec 23 2024 09:49:13 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ నెక్ట్స్ టార్గెట్
తెలంగాణపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. రానున్న తెలంగాణ ఎన్నికల్లో ఆప్ పోటీకి సిద్ధమయింది
తెలంగాణపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. రానున్న తెలంగాణ ఎన్నికల్లో ఆప్ పోటీకి సిద్ధమయింది. ఈ మేరకు పార్టీ హైకమాండ్ నుంచి సంకేతాలు అందుతున్నాయి. ఏప్రిల్ 14 వ తేదీన తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ పాదయాత్ర చేపట్టనుంది. ఆరోజు అంబేద్కర్ జయంతి కావడంతో ఈ పాదయాత్రను స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రారంభించనున్నారని తెలిసింది.
రెండు రాష్ట్రాల్లో.....
ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక ప్రాంతీయ పార్టీ గా అవతరించింది. ఇటీవల పంజాబ్ ఎన్నికల్లో సునామీ సృష్టించింది. 117 స్థానాలకు గాను 92 స్థానాలను సాధించి పంజాబ్ కింగ్ అయింది. ఢిల్లీ, పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టనుంది. వచ్చే ఏడాది తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బరిలోకి దిగి బోణీ కొట్టాలన్న ఆలోచనతో ఉంది.
పాదయాత్రతో....
తెలంగాణ పార్టీ ఇన్ ఛార్జిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాధ్ భారతిని నియమించారు. దక్షిణాది రాష్ట్రాల ఇన్ ఛార్జిగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. ఆయన తెలంగాణ పార్టీ నేతలతో నిత్యం సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానిక సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. ఢిల్లీలో అమలు చేస్తున్న పథకాలను ఇక్కడ కూడా అమలు చేస్తామన్న హామీతో ఆ పార్టీ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు కేజ్రీవాల్ సమాయత్తమవుతున్నారు.
Next Story