ఏబీవెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేత.. హైకోర్టు ఆదేశాలు
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. తనను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలంటూ ఏబీ వెంకటేశ్వరరావు గతంలో క్యాట్ [more]
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. తనను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలంటూ ఏబీ వెంకటేశ్వరరావు గతంలో క్యాట్ [more]
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. తనను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలంటూ ఏబీ వెంకటేశ్వరరావు గతంలో క్యాట్ ను ఆశ్రయించాడు. అక్కడకూడా ఏబీ వెంకటేశ్వరరావుకు ఎలాంటి అనుకూలమైన ఆదేశాలు రాలేదు. దీంతో తన సస్పెన్షన్ పై ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై ప్రభుత్వంతో పాటు వాదనలు ప్రభుత్వం హైకోర్టు వినింది. ఇవాళ ఏబీ వెంకటేశ్వరరావు కు అనుకూలంగా తీర్పు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. వెంకటేశ్వరరాు పై ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను వెంటనే రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావు ఊరట లభించినట్లయింది. అలాగే సస్పెన్షన్ కాలం నాటి జీతభత్యాలను చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న వైసీపీ ప్రభుత్వం వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ విధించింది.