Mon Dec 23 2024 17:40:29 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : గుంటూరులో ఘోర రోడ్డుప్రమాదం
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లాలుపరం హైవే వద్ద ఏడుగురు విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు మితిమీరిన వేగంతో మొదట కంటైనర్ ను ఢీకొని తర్వాత [more]
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లాలుపరం హైవే వద్ద ఏడుగురు విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు మితిమీరిన వేగంతో మొదట కంటైనర్ ను ఢీకొని తర్వాత [more]
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లాలుపరం హైవే వద్ద ఏడుగురు విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు మితిమీరిన వేగంతో మొదట కంటైనర్ ను ఢీకొని తర్వాత డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన విద్యార్థులంతా గుంటూరులోని ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ముందువెళ్తున్న కంటైనర్ ను వెనుక నుంచి వీరి కారు ఢీకొట్టడంతో ఏకంగా కంటైనర్ బోల్తాకొట్టింది. కంటైనర్ డ్రైవర్ కి కూడా గాయాలయ్యాయి.
Next Story