Mon Dec 23 2024 02:10:31 GMT+0000 (Coordinated Universal Time)
బాబు ఓట్లన్నీ జగన్ జేబులో.. ఆత్మకూరు ఉప ఎన్నిక
ఆత్మకూరు ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అనుకూల ఓట్లు కూడా వైసీపీకే పడినట్లు అంకెలను బట్టి తెలుస్తోంది
ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్ ముగిసింది. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి 82,888 ఓట్ల మెజారిటీ లభించింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థికి 19,316 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం పోలయిన ఓట్లు 1,37,000. ఈ ఉప ఎన్నికల్లో 1,02,240 ఓట్లు మేకపాటి విక్రమ్ రెడ్డికి వచ్చాయి. అందులో 19 వేల ఓట్లు బీజేపీకి పడ్డాయి. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ అనుకూల ఓట్లు కూడా వైసీపీకే పడినట్లు అర్థమవుతుంది.
టీడీపీకి....
తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బలమైన ఓటు బ్యాంకు ఉంది. పైగా మూడు సంవత్సరాల వైసీపీ పాలనపై అసంతృప్తి పెరిగిందని చంద్రబాబు పదే పదే అంటున్నారు. బాదుడే బాదుడే అంటూ జిల్లాలు పర్యటిస్తున్నారు. కానీ ఉప ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఓట్లు వైసీపీకి పడ్డాయి. టీడీపీ సానుభూతిపరుల ఓట్లను కూడా టీడీపీయే కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. దీంతో ఆ ఓట్లు వైసీపీ వ్యతిరేక పార్టీకి పడాలి.
గత ఎన్నికల్లో...
కానీ వైసీపీకే టీడీపీ అనుకూల ఓట్లు పడినట్లు స్పష్టమవుతుంది. 2019 లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 70,482 ఓట్లు వచ్చాయి. టీడీపీ తన ఓటర్లు పోలింగ్ లో పాల్గొనలేదని సమర్థించుకోవచ్చు. కానీ వైసీపీ వ్యతిరేక, టీడీపీ సానుభూతిపరుల ఓట్లు ఖచ్చితంగా బీజేపీకి పడాల్సి ఉంటుంది. కానీ ఎన్నికల ఫలితాలను చూసిన వారెవరికైనా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు కూడా వైసీపీ లాగేసుకుందని అనిపించక మానదు.
పరోక్ష సహకారం...
పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నాయకులు పోలింగ్ ఏజెంట్లుగా అనేక చోట్ల కూర్చున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అక్కడ బీజేపీకి ఎంతమాత్రం బలం లేదు. దీంతో టీడీపీ నేతలు పోలింగ్ కు పరోక్ష సహకారం అందించారంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి టీడీపీ ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్పక తప్పదు. బీజేపీకి బదిలీ అవ్వాల్సిన ఓట్లు అధికార వైసీపీ వైపు మరలడం చర్చనీయాంశంగా మారింది. ఇది టీడీపీ అగ్రనాయకత్వం ఆలోచించుకోవాల్సిన అంశమే మరి.
Next Story