కేసుల కోసం కేంద్రం వద్ద మోకరిల్లారు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మౌనం వీడాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మౌనం వీడాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మౌనం వీడాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్నా జగన్ పట్టించుకోవడం లేదన్నారు. దీంతో లక్షలాది మంది కార్మికులు వీధిన పడ్డారని అచ్చెన్నాయుడు అన్నారు. ఫోక్సో కంపెనీకి స్టీల్ ప్లాంట్ ను కట్టబెట్టి కమీషన్లు కొట్టేయాలన్నదే జగన్ ప్లాన్ అని అచ్చెన్నాయుడు అన్నారు. కేంద్రం వద్ద కేసుల కోసం జగన్ రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇప్పటికైనా విశాఖ స్టీల్ ప్లాంట్ పై వైసీపీ తన వైఖరిని చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.