బ్రేకింగ్ : స్కామ్ పై అచ్చెన్న రెస్పాన్స్
తాను ఏ స్కామ్ చేయలేదని, ప్రధాని ఆదేశాల మేరకే పనిచేశామని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈఎస్ఐ లో జరిగిన భారీ కుంభకోణంలో తన పాత్ర ఏమీ [more]
తాను ఏ స్కామ్ చేయలేదని, ప్రధాని ఆదేశాల మేరకే పనిచేశామని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈఎస్ఐ లో జరిగిన భారీ కుంభకోణంలో తన పాత్ర ఏమీ [more]
తాను ఏ స్కామ్ చేయలేదని, ప్రధాని ఆదేశాల మేరకే పనిచేశామని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈఎస్ఐ లో జరిగిన భారీ కుంభకోణంలో తన పాత్ర ఏమీ లేదని తెలిపారు. నామినేషన్ పద్ధతిలో మందులు కొనుగోళ్లు చేయమని తాను సిఫార్సు చేసినట్లు కథనాలు వచ్చాయన్నారు. 2016-17 వరకూ కార్మిక శాఖగా ఉన్నానని, టెలి సర్వీసెస్ కు పనులు అప్పగించమని చెప్పానని వార్తలు వస్తున్నాయని, ప్రధాని మోదీ చెప్పిన మేరకే తాము చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసినట్లే తాము ఏపీలో అమలు చేశామని చెప్పారు. కావాలనే తనపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెలి హెల్త్ సర్వీసెస్ 24 గంటలూ పనిచేయమని కేంద్ర ప్రభుత్వం చెబితేనే చేశామని అచ్చెన్నాయుడు తెలిపారు. తాను ఎప్పుడూ తప్పు చేయనని, అవినీతికి పాల్పడే అలవాటు తనకు, తన కుటుంబానికి లేదన్నారు.