బొత్సకు అచ్చెన్న సవాల్
మంత్రి బొత్స సత్యనారాయణకు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. రాజధాని అమరావతిలో చంద్రబాబు ఒక్క ఇటుక కూడా పేర్చలేదని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడాన్ని ఆయన ఖండించారు. [more]
మంత్రి బొత్స సత్యనారాయణకు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. రాజధాని అమరావతిలో చంద్రబాబు ఒక్క ఇటుక కూడా పేర్చలేదని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడాన్ని ఆయన ఖండించారు. [more]
మంత్రి బొత్స సత్యనారాయణకు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. రాజధాని అమరావతిలో చంద్రబాబు ఒక్క ఇటుక కూడా పేర్చలేదని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడాన్ని ఆయన ఖండించారు. రాజధాని నిర్మాణాలను పరిశీలించిన టీడీపీ ఎమ్మెల్యేలు మధ్యలో ఆగిపోయిన భవనాలను మీడియాకు చూపించారు. దాదాపు 280 ప్లాట్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసమని నిర్మించాలనుకుంటే, వాటిని మధ్యలోనే వైసీపీ ప్రభుత్వం నిలిపేసిందన్నారు. రెండు నెలలు పనులు జరిగితే అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వసతి సమకూరేదన్నారు. అలాగే ఉద్యోగులకు కూడా వసతి సదుపాయం కల్పించాలన్న ఉద్దేశ్యంతో నిర్మించ తలపెట్టిన భవనాలను మధ్యలోనే ఆపేశారన్నారు. బొత్స సత్యనారాయణకు దమ్ముంటే తనతో అమరావతికి రావాలని, చంద్రబాబు అమరావతిలో ఏం నిర్మించారో నిరూపిస్తామని సవాల్ విసిరారు అచ్చెన్నాయుడు.