Thu Apr 10 2025 06:47:05 GMT+0000 (Coordinated Universal Time)
చింతమనేని అనుచరులపై సినీనటి ఫిర్యాదు

దెందులూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై సినీనటి అపూర్వ ఫిర్యాదు చేశారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో చింతమనేని ప్రభాకర్ ఆకృత్యాలపై పలు వ్యాఖ్యలు చేశారు. అయితే, అప్పటి నుంచి చింతమనేని అనుచరులు తనను వేధిస్తున్నారని, తనపై, తన కుటుంబంపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ హింసిస్తున్నారని ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, తన భర్తకు మధ్య విభేదాలు రావడంతో విడిపోయామని, ఇప్పుడు ఆయనను తెరపైకి తీసుకువచ్చి తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆమె ఆరోపంచారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
Next Story