Mon Dec 23 2024 08:10:22 GMT+0000 (Coordinated Universal Time)
నయన్ కొన్న ఇంటి ఖరీదెంతో తెలుసా?
ప్రముఖ నటి నయనతార చెన్నైలో రెండు ఇళ్లను కొనుగోలు చేశారు. పొయస్ గార్డెన్ లో ఇళ్లను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు
ప్రముఖ నటి నయనతార చెన్నైలో రెండు ఇళ్లను కొనుగోలు చేశారు. పొయస్ గార్డెన్ లోనే నయన్ రెండు ఇళ్లను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఇటీవల దర్శకుడు విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న నయనతార చెన్నైలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో రెండు ఇళ్లను కొనుగోలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇళ్లు వేదనిలయానికి సమీపంలోనే ఈ ఇళ్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది.
పొయెస్ గార్డెన్ లో....
పొయెస్ గార్డెన్ లో ప్రముఖులు నివాసముంటారు. రజనీకాంత్ కూడా ఈ ప్రాంతంలోనే నివాసం ఉంటారు. అటువంటి ఖరీదైన ప్రాంతంలో నయనతార రెండు ఇళ్లు కొనుగోలు చేయడం ఆశ్చర్యంగా మారింది. ఒక్కో ఇల్లు ఎనిమిదివేల చదరపు అడుగులు ఉంటుందని చెబుతున్నారు. ముంబయికి చెందని ఒక ప్రముఖ సంస్థకు ఈ ఇళ్ల ఇంటీరియర్ డిజైన్ ను చేసే బాధ్యతను అప్పగించారు. ఇందుకు 25 కోట్ల రూపాయల మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. మొత్తం మీద నయన్ ఇళ్ల కొనుగోలు కోలివుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
Next Story