పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. జూన్ 1వ తేదీ నుంచి టీచర్లు పాఠశాలలకు హాజరు కావాలని ఆయన [more]
పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. జూన్ 1వ తేదీ నుంచి టీచర్లు పాఠశాలలకు హాజరు కావాలని ఆయన [more]
పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. జూన్ 1వ తేదీ నుంచి టీచర్లు పాఠశాలలకు హాజరు కావాలని ఆయన కోరారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రభుత్వం ఒక్కో విధంగా ముందుకు వెళుతుందన్నారు. ముందస్తుగా షెడ్యూల్ ఇచ్చి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. పదో తరగతి పరీక్షలకు ఇంకా మూడు వారాల సమయం ఉందని, ఆలోపు నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆదిమూలపు సురేష్ తెలిపారు.