Sat Nov 23 2024 04:48:51 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో అన్నీ బంద్… పదో తరగతి పరీక్షలు మాత్రం?
ఏపీలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ నెల 31వ తేదీ వరకూ స్కూళ్లు, కళాశాలలు, యూనివర్సిటీలకు సెలవు ప్రకటించారు మంత్రి ఆదిమూలపు సురేష్. కరోనా వైరస్ [more]
ఏపీలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ నెల 31వ తేదీ వరకూ స్కూళ్లు, కళాశాలలు, యూనివర్సిటీలకు సెలవు ప్రకటించారు మంత్రి ఆదిమూలపు సురేష్. కరోనా వైరస్ [more]
ఏపీలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ నెల 31వ తేదీ వరకూ స్కూళ్లు, కళాశాలలు, యూనివర్సిటీలకు సెలవు ప్రకటించారు మంత్రి ఆదిమూలపు సురేష్. కరోనా వైరస్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పదో తరగతి పరీక్షలు మాత్రం షెడ్యూల్ ప్రకారం యధాతధంగా జరుగుతాయని చెప్పారు. ఇవి ప్రయివేటు స్కూళ్లు, కళాశాలలకు వర్తిస్తుందని చెప్పారు. ఈ నెల 31వ తేదీ తర్వాత పరిస్థితిని చూసి తిరిగి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. దగ్గు, జలుబు ఉన్న విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
Next Story