Thu Jan 16 2025 06:53:38 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ భవిష్యత్ పై మంత్రి ఆది జోస్యం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వై.ఎస్.వివేకానందరెడ్డిని ఓడించానని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తనపై కక్ష కట్టారని మంత్రి ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. జగన్ పై దాడి కేసులో తన ప్రమేయం ఉందని వైసీపీ నేతలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారని, అసలు ఏ ఆదారాలతో తనపై ఫిర్యాదు చేశారని ప్రశ్నించారు. జగన్ కు ఏం జరిగినా చంద్రబబుదే బాధ్యత అనడం సరికాదన్నారు. జగన్ కు సీఎం పదవిపై ఆసక్తి తప్ప మరోటి కనపడటం లేదన్నారు. తెలంగాణలో జగన్ పార్టీ మూసేశారని, త్వరలో ఏపీలో కూడా మూసేస్తారని జోస్యం చెప్పారు. కడప జిల్లాకు ఉక్కు కర్మాగారం రావడం జగన్ కి ఇష్టం లేదన్నారు.
Next Story