Mon Dec 23 2024 07:15:02 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో మరో కొత్తవైరస్.. త్రిపురలో తొలి కేసు
ఏప్రిల్ 7న అక్కడ శాంపిల్స్ సేకరించి టెస్ట్ కోసం ఈశాన్య ప్రాంతీయ వ్యాధి నిర్థారణ లాబోరేటరీకి పంపగా.. 13వ తేదీన వచ్చిన..
త్రిపుర : భారత్ లో మరో కొత్తవైరస్ ఆందోళన కలిగిస్తోంది. త్రిపురలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ఏఎస్ఎఫ్) తొలి కేసు వెలుగుచూసింది. సెపాహిజాలా జిల్లా పరిధిలోని దేవిపూర్ లో ఉన్న జంతు వనరుల అభివృద్ధి శాఖ నిర్వహిస్తోన్న ఫారమ్ లో ఈ కేసులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అప్రమత్తమైన నిపుణుల బృందం అగర్తలలో ఉన్న ఆ ఫారమ్ ను సందర్శించి పరిస్థితిని అంచనా వేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ లను ఏర్పాటు చేసింది.
ఏప్రిల్ 7న అక్కడ శాంపిల్స్ సేకరించి టెస్ట్ కోసం ఈశాన్య ప్రాంతీయ వ్యాధి నిర్థారణ లాబోరేటరీకి పంపగా.. 13వ తేదీన వచ్చిన పీసీఆర్ ఫలితాల్లో పాజిటివ్ గా వచ్చినట్లు నిర్థారించారు. ఫారమ్ లో ఉన్న పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ లక్షణాలుండటంతో.. ఫీవర్ ఫారమ్ మొత్తం వ్యాపించి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఫారమ్ లో ఉన్న పందులన్నింటికీ నిర్థారణ అయితే.. వాటిని సామూహికంగా ఉరి తీయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఆ పందుల షెడ్డులో 63 పందులు గుర్తుతెలియని కారణాలతో చనిపోయాయి. మరో 265 పందులు, 185 పంది పిల్లలు ఆ షెడ్డులో ఉన్నాయి.
Next Story