హమ్యయ్య కొంచెం తగ్గాయి… కానీ?
చాలా రోజుల తర్వాత తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గింది. రోజుకు 1800 నుంచి 2000 కేసుల వరకూ నమోదవ్వడం ఆందోళన కల్గించింది. అయితే శుక్రవారం [more]
చాలా రోజుల తర్వాత తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గింది. రోజుకు 1800 నుంచి 2000 కేసుల వరకూ నమోదవ్వడం ఆందోళన కల్గించింది. అయితే శుక్రవారం [more]
చాలా రోజుల తర్వాత తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గింది. రోజుకు 1800 నుంచి 2000 కేసుల వరకూ నమోదవ్వడం ఆందోళన కల్గించింది. అయితే శుక్రవారం మాత్రం కేసుల సంఖ్య తగ్గింది. తెలంగాణలో కొత్తగా 1,278 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. పదివేల మందికి పరీక్షలు నిర్వహించగా అందులో పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగానే ఉండటం ఊరటినిచ్చే అంశం. తాజాగా నమోదయిన కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 32,224కు చేరుకుంది. కొత్తగా నమోదయిన కేసుల్లో 769 హైదరాబాద్ పరిధిోనే ఉన్నాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా బారిన పడి కోలుకున్న వారు 19,205 మంది ఉన్నారు. యాక్టివ్ కేసులు 12,680 ఉన్నాయి. తెలంగాణలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 339 కు చేరుకుంది.