Sat Nov 23 2024 02:28:44 GMT+0000 (Coordinated Universal Time)
సీనియర్లలో సీరియస్ లేదా?
ఇంగ్లండ్ టీ 20 మూడో మ్యాచ్ చూసిన తర్వాత సీనియర్ ఆటగాళ్లలో సీరియస్ నెస్ లేదనే అనిపించింది
ఇంగ్లండ్ టీ 20 మూడో మ్యాచ్ చూసిన తర్వాత సీనియర్ ఆటగాళ్లలో సీరియస్ నెస్ లేదనే అనిపించింది. అలా వచ్చి ఇలా అవుటవ్వడం వారికి అలవాటుగా మారింది. లక్ష్యం భారీగా ఉన్నా ఏమాత్రం సీరియస్ లేకుండా ఆడటంపై క్రీడావిశ్లేషకులు సయితం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి అవుట్ కావడంతో ఈ వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సిరీస్ అప్పటికే గెలిచామని ధీమా కావచ్చు. లేదా? భారీ షాట్లకు ప్రయత్నం చేసి ఉండవచ్చు.
11 పరుగులకే...
చివరకు ఏమైనా ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు 11 పరుగులకే అవుట్ అయిపోయారు. అయితే సూర్యకుమార్ యాదవ్ వేగంగా సెంచరీ చేయడంతో భారత్ పరువు నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 216 పరుగులు చేసింది. భారీ లక్ష్యం ముందుంది. రోహిత్ శర్మ, రిషబ్ పంత్ బరిలోకి దిగారు. రిషబ్ పంత్ కీపర్ క్యాచ్ కింద అంపైర్ అవుట్ ఇచ్చాడు. కాని రిషబ్ పంత్ తన ప్యాడ్ కు తగిలిందని చెబుతున్నా రోహిత్ శర్మ పట్టించుకోలేదు. అప్పటికే డీఆర్ఎస్ కోరుకునే సమయం పూర్తవ్వడంతో రిషబ్ పంత్ వెనుదిరిగి వెళ్లాడు. చివరకు రీ ప్లేలో అది ప్యాడ్ కు తగిలినట్లుగా కనపడింది.
కొహ్లి, రోహిత్...
ఇక విరాట్ కొహ్లీ విషయం అయితే చెప్పాల్సిన పనిలేదు. వచ్చిన వెంటనే ఒక ఫోర్ కొట్టిన కొహ్లి దూకుడు మీదున్నట్లు కన్పించాడు. కానీ వెంటనే అవుటయ్యాడు. కొహ్లి అవుటయిన కొద్దిసేపటికే రోహిత్ శర్మ సిక్సర్ కు ట్రై చేసి ఇంగ్లండ్ ఆటగాడి చేతికి దొరికిపోయాడు. ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు ఓటమి పాలయినా కుర్రోళ్లు సీరియస్ గా తీసుకుని ఇండియా పరువు నిలబెట్టారు. చివరకు 17 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలు కావాల్సి వచ్చింది. సీనియర్ ఆటగాళ్లను తప్పించడమే మేలన్న కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి. వారి అనుభవం కన్నా కుర్రోళ్లు కసితో ఆడుతుండటంతోనే ఈ కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story