సినిమా చూపించి మరీ కిడ్నాప్
అఖిలప్రియ కిడ్నాప్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. కిడ్నాప్ కు సంబంధించిన వ్యవహారాలను ఇప్పుడు బట్టబయలు అవుతున్నాయి. ప్రవీణ్, నవీన్ రావు ,సునీల్ రావులని [more]
అఖిలప్రియ కిడ్నాప్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. కిడ్నాప్ కు సంబంధించిన వ్యవహారాలను ఇప్పుడు బట్టబయలు అవుతున్నాయి. ప్రవీణ్, నవీన్ రావు ,సునీల్ రావులని [more]
అఖిలప్రియ కిడ్నాప్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. కిడ్నాప్ కు సంబంధించిన వ్యవహారాలను ఇప్పుడు బట్టబయలు అవుతున్నాయి. ప్రవీణ్, నవీన్ రావు ,సునీల్ రావులని ఏ విధంగా కిడ్నాప్ చేయాలనే దానిపై ఏకంగా సినిమానే వేసి చూపించారు. ఇందుకు హిందీ నటుడు అక్షయ్ కుమార్ నటించిన సినిమాను కిడ్నాపర్ల చూపెట్టారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ అండ్ గ్యాంగ్ ఐటి అధికారులు గా పేర్కొంటూ పెద్దమొత్తంలో దోపిడీలకు పాల్పడుతున్నారు. అయితే ఈ సినిమా అఖిలప్రియకు బాగా నచ్చింది. దీంతో భర్త, భార్య ,మరిది కలిసి ఈ సినిమాని పదేపదే చూశారు. ఆ తర్వాత ఇదే తరహాలో ప్రవీణ్, నవీన్ రావు సునీల్ రావును కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశారు. దీనిని పూర్తిగా అమలు చేసే బాధ్యతను భార్గవరామ్ తన సోదరుడికి అప్పగించాడు. అందర్నీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఈ సినిమాను చూపెట్టాడు.
ప్రాక్టీస్ కూడా….
ఈ సినిమాలో ఉన్న విధంగా కిడ్నాప్ కిడ్నాప్ ఎలా చేయాలి అన్న దాని మీద ఒక్కొక్కరికి ఒక బాధ్యతను అప్పగించాడు. ముఖ్యంగా ఎంజీఎం స్కూల్ లో ఈ ప్రాక్టీస్ మొత్తం నడిచింది. దాదాపు మూడు నెలల నుంచి జరిగిన ఈ ప్రాక్టీస్ లో అక్షయ్ కుమార్ నటించిన సినిమా తరహాలోనే కిడ్నాప్ చేయాలని పథకం రచించారు. అంతేకాకుండా శ్రీనగర్ కాలనీలో ఉన్న ఒక సినిమా కాస్ట్యూమ్స్ ఆఫీస్ నుంచి ఐటి అధికారులతో పాటు పోలీసు అధికారులు అద్దెకు తీసుకున్నారు. దీంతోపాటుగా ఐటి అధికారుల పేర్లమీద ఐడి తయారు చేసుకున్నారు. మరోవైపు కార్లను కూడా ఎంగేజ్ చేశారు. అయితే ఈ విషయాలన్నీ కూడా అఖిలప్రియ పోలీస్ కస్టడీలో వివరించింది. మూడు రోజుల పోలీస్ కస్టడీ లో రెండోరోజు విచారణలో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు అఖిల ప్రియ ను పోలీసు అధికారులు ప్రశ్నించారు. ఇందులో సినిమా తరహాలోనే తాము కిడ్నాప్ కు పాల్పడినట్లు వెల్లడించింది.