Tue Nov 05 2024 16:45:17 GMT+0000 (Coordinated Universal Time)
మద్యపానం వల్ల పిల్లలు పుట్టరా ? పరిశోధకులు ఏం చెప్తున్నారు ?
టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ను విడుదల చేసే వృషణాల్లోని లెడిగ్ కణాలపై, వీర్యం విడుదలకు కారణమయ్యే లూటినైజింగ్ హార్మోన్, ఫొలికల్
మద్యపానం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మద్యపానం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్యులు ఎప్పట్నుంచో చెప్తున్నారు. దాని వల్ల కాలేయం, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని ఇప్పటి వరకూ చెప్పారు. ఇప్పుడు కొత్తగా.. మద్యపానం ప్రభావం సంతానంపై కూడా పడుతుందని చెప్తున్నారు పరిశోధకులు. న్నైలోని చెట్టినాడ్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, చెట్టినాడ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చేసిన ఓ అధ్యయనంలో ఈ షాకింగ్ విషయం వెల్లడైంది.
231 మంది పురుషులపై పరిశోధన చేయగా.. వారిలో 81 మంది మద్యం తాగేవారు, మిగతా 150 మంది మద్యం అలవాటు లేనివారు ఉన్నారు. వారందరి ఆరోగ్య వివరాలను సేకరించి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు వారి వీర్యం, వీర్యకణాలపై పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో మద్యం అలవాటు లేనివారితో పోలిస్తే.. అలవాటు ఉన్నవారి వీర్య కణాలు, వాటి నాణ్యత చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది.
Also Read : తవ్వకాల్లో బయటపడిన చార్మినార్ భూగర్భ మెట్లు
టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ను విడుదల చేసే వృషణాల్లోని లెడిగ్ కణాలపై మద్యం ప్రభావం చూపడం వల్లే ఈ సమస్య తలెత్తుతోందని పరిశోధకులు తమ అధ్యయనంలో తేల్చారు. వీర్యం విడుదలకు కారణమయ్యే లూటినైజింగ్ హార్మోన్, ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్లపైనా మద్యం ప్రభావం చూపుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. తద్వారా దాని ప్రభావం సంతానోత్పత్తిపై పడుతోందని తేలింది. నిత్యం మద్యం సేవించే వారిలో వీర్యకణాల సంఖ్య చాలా తక్కువగా ఉండటం వల్ల.. వారికి సంతానం కలగడం లేదని పరిశోధనకులు చెప్తున్నారు.
Next Story